Header Banner

తరచూ తలనొప్పి వస్తోందా.. ఈ ఆరు సమస్యలు కావొచ్చు! అయినా పర్వాలేదని లైట్ తీసుకుంటే ప్రాణాలు ఫసక్..

  Thu Feb 13, 2025 17:32        Health

ఇటీవలి కాలంలో తరచూ తలనొప్పితో బాధపడేవారి సంఖ్య పెరిగిపోయింది. రణగొణ ధ్వనులు ఓవైపు, తీవ్ర ఒత్తిడి, మానసిక ఆందోళన వంటివి మరోవైపు తలనొప్పికి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ మన శరీరంలో ఏర్పడే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా తలనొప్పి రూపంలో బయటపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిని జాగ్రత్తగా గమనించి, తగిన చర్యలు తీసుకుంటే... మంచిదని సూచిస్తున్నారు.

రక్తపోటు (బ్లడ్ ప్రెషర్)
యుక్త వయసు దాటిన వారిలో తరచూ తలనొప్పి వస్తోందంటే... వారిలో రక్తపోటు స్థాయి సరిగా లేదని అర్థమని నిపుణులు చెబుతున్నారు. బ్లడ్ ప్రెషర్ తక్కువగాగానీ, ఎక్కువగా గానీ ఉండటం, ఉన్నట్టుండి పెరుగుతూ, తగ్గుతూ ఉండటం వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు.

తీవ్ర ఒత్తిడి (స్ట్రెస్)
ప్రస్తుతం ఉరుకులు, పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిడి మధ్య జీవిస్తున్నారు. అయితే ఇలా ఒత్తిడి ఎక్కువకాలం కొనసాగితే... వారు తరచూ తలనొప్పి బారిన పడతారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఆహారం జీర్ణ కాకపోవడం...
సరిగా నిద్రలేకపోవడం, వేళకు తినకపోవడం, మసాలాలు, కారం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వంటివాటికితోడు పలు ఇతర సమస్యల కారణంగా జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. తిన్న ఆహారం సరిగా జీర్ణంకాదు. ఇలాంటి వారిలో తలనొప్పి సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు తీవ్ర స్థాయిలో తలనొప్పితో బాధపడే అవకాశం ఎక్కువని వివరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: విర్రవీగితే ఏమి జరుగుతుందో, వంశీ అరెస్ట్ ఒక ఉదాహరణ! ఫిర్యాదు చేసిన వ్యక్తినే కిడ్నాప్!


కంటి సమస్యలు..
ఎవరిలోనైనా కంటి చూపు సమస్య మొదలైందంటే... అది తలనొప్పి రూపంలో మొదట బయటపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ తరహా తలనొప్పి మరీ తీవ్రంగా ఉండదని... కానీ ఎక్కువ సేపు ఉండటం, తరచూ సమస్య తలెత్తడం జరుగుతుందని వివరిస్తున్నారు. తరచూ స్వల్పస్థాయి తలనొప్పి వేధిస్తుంటే... కంటి పరీక్షలు చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

మైగ్రేన్...
మెదడులోని రసాయనాల స్థితిలో తేడాలు రావడం వల్ల తీవ్ర స్థాయి తలనొప్పి వస్తుంది. దీనిని మైగ్రేన్ గా పిలుస్తారు. ఈ తరహా తలనొప్పిలో ఎక్కువ వెలుతురును, శబ్దాన్ని భరించలేకపోతారని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల కూడా మైగ్రేన్ తలెత్తే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు.

బ్రెయిన్ ట్యూమర్...
ఎవరైనా తరచూ, తీవ్ర స్థాయిలో తలనొప్పితో బాధపడుతూ కారణం ఏమిటో గుర్తించలేకపోతే... అది బ్రెయిన్ ట్యూమర్ సమస్య కావొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. మెదడులో కణతులు ఏర్పడితే... తలనొప్పి సమస్య తరచూ వేధిస్తుందని, తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

మరెన్నో కారణాలు... తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు...
ఒక్కసారిగా మొదలయ్యే తలనొప్పి... కొన్నిసార్లు గుండెపోటు లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందటి లక్షణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది అరుదు అని పేర్కొంటున్నారు. మెదడులో ద్రవాలు పేరుకుపోవడం వంటివి కూడా తలనొప్పికి దారితీయవచ్చని చెబుతున్నారు. అందువల్ల తరచూ తలనొప్పి వేధిస్తుంటే... ముందుగా వైద్యులను కలిసి తగిన పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మోహన్ బాబు మరో ట్విస్ట్.. ఆ ఫిర్యాదు ఆధారంగా.. కుటుంబంలో కొంతకాలంగా గొడవలు!

 

ఏలూరులో ఉద్రిక్తత.. టీడీపీ-వైసీపీ నేతల మధ్య ఘర్షణ! కారణం ఏంటో తెలుసా..!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీ లాంటి మరో నాలుగు మృగాలను కూడా అరెస్ట్!

 

ప‌వ‌న్ నుంచి ఈ ల‌క్ష‌ణాన్ని తాను కూడా అల‌వాటు చేసుకోవాల‌న్న హీరోయిన్‌! సోషల్ మీడియా లో వైరల్!

 

శ్రీకాకుళం జిల్లాలో వైరస్ కలకలం! పదేళ్ల బాలుడి మృతి.. వైద్యుల నివేదికపై ఉత్కంఠ!

 

నేడు (13/2) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మరో నామినేటెడ్ పోస్టుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ! ఆ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా ఆయన నియామకం!

 

మార్కెట్‌లోకి కొత్త 50 రూపాయల నోటు.. RBI కీలక ప్రకటన.! మరి పాత నోట్ల పరిస్థితి.?

 

వైసీపీకి భారీ షాక్.. ఆ జిల్లాలో కీలక పరిణామం.. టీడీపీలో చేరిన వైసీపీ నేత! 20 కుటుంబాలు ఈరోజు..

 

ఈసారి Valentines Dayకి మీ గర్ల్ ఫ్రెండ్ ని విమానం లో తీసుకువెళ్లండి.. భారీగా డిస్కౌంట్ ఇస్తున్న ఇండిగో! త్వరగా బుకింగ్ చేసుకోండి!

 

ఏపీ మహిళలకు శుభవార్త.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! కొత్త నిర్ణయాలను అమల్లోకి.. ఈ రంగాల్లో వారికి..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Headache #Health #science #ViralNews